మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు.
దాంతో చాలా మంది బరువు తగ్గడం కోసం రాత్రి పూట అన్నం బదులు చపాతీలు తింటున్నారు.
మరి ఇలా అన్నం బదులు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా.. అసలు చపాతీలను ఎలా తింటే మంచిది వంటి వివరాలు
చపాతీలను తయారు చేసే గోధుమ పిండిలో విటమిన్ బి, ఇ, కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
అన్నం తినడం వల్ల ఎంత శక్తి లభిస్తుందో చపాతీల వల్ల కూడా అంతే ఎనర్జీ లభిస్తుంది.
కానీ అన్నం కంటే చపాతీ త్వరగా జీర్ణం అవుతుంది. చపాతీలను నూనె లేకుండా... లేదంటే తక్కువ నూనె వేసి కాల్చడం వల్ల అన్నంతో పోల్చినప్పుడు కాస్త తక్కువ క్యాలరీలు ఉంటాయి.
అతేకాక రెండు, మూడు చపాతీలు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దాంతో తక్కువ ఆహారం తీసుకుంటాము. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతాము అంటున్నారు నిపుణులు.
ఇక బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల్లోపు చపాతీలను తినడం బెటర్ అంటున్నారు.
వాటిని కూడా నూనె లేకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
చపాతీలు తినడం వల్ల కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు.
గోధుమల్లో అధికంగా ఉండే విటమిన్ ఇ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.
చపాతీలను తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.
అంతేకాక రాత్రిపూట భోజనంలో భాగంగా చపాతీలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాట మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.