ఆడవారిలో సహజంగానే ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ రుతుస్రావం సైకిల్ ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఇదే హార్మోన్ కరోనరీ ఆర్టరీ వల్ల వచ్చే గుండెపోటు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ధమని గోడల లోపల కొవ్వు ఫలకాలు ఏర్పడకుండా కాపాడుతుంది.

అయితే వయసు పెరిగే కొద్దీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.

అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

మోనోపాజ్ సమయంలో ఆడవారి శరీరం తక్కువ ఈస్ట్రోజన్ ని విడుదల చేస్తుంది. దీని వల్ల కరోనరి ఆర్టరీ సమస్య వస్తుంది.

ఈస్ట్రోజన్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రవాహాన్ని పెంచేందుకు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.   

ఈస్ట్రోజన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. అయితే వయసు పెరగడం, మోనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ తక్కువ రిలీజ్ అవుతుంది.

అటువంటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తింటే ఈస్ట్రోజన్ విడుదల పెరుగుతుంది.

సోయాబీన్స్ సోయాబీన్స్ లో ఉండే టోఫు, మిసో అనేవి ఫైటోఈస్ట్రోజన్స్ ఉత్పత్తికి మూలంగా ఉంటాయి. ఫైటోఈస్ట్రోజన్స్ అనేవి శరీరంలోని ఈస్ట్రోజన్ విడుదలకు దోహదం చేస్తాయి.

సోయా గింజలు ఎక్కువగా తినేవారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

దీనికి కారణం శరీరంలో ఫైటోఈస్ట్రోజన్స్ వంటి ఈస్ట్రోజన్ డెవలప్ అవ్వడమే అని వైద్యులు చెబుతున్నారు. 

అవిసె గింజలు అవిసె గింజలు ఈస్ట్రోజన్ ఉత్పత్తికి దోహదపడతాయి. ఇందులో ఫైటోఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ జీవక్రియను వృద్ధి చేస్తాయి. 

నువ్వుల గింజలు నువ్వుల గింజలు ఈస్ట్రోజన్ ఉత్పత్తికి సహకరిస్తాయని పరిశోధనలో తేలింది. 

విటమిన్ బి, విటమిన్ డి విటమిన్ బి ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడానికి, ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి. 

విటమిన్ డి, ఈస్ట్రోజన్ కలిస్తే హృదయనాళ వ్యాధులు రావని అధ్యయనాలు చెబుతున్నాయి. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.