అన్ని ప్రయాణాల్లో కెల్లా రైలు ప్రయాణం సౌకర్యవంతమైనది. ఎక్కువుగా సుదూర ప్రయాణాలు చేసేవారు రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు.
అంతేకాదు.. ఇతర ప్రయాణాలతో పోలిస్తే.. ఖర్చు కూడా చాలా తక్కువ. అందువల్ల ఎక్కువ మంది ప్రజలు రైలు జర్నీకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు.
అయితే ఒక్కోసారి రైళ్లలో సీటు దొరకడం కష్టం. బుక్ చేసుకున్నా.. కంఫర్మ్ అవుతుందో.. లేదో.. చెప్పలేం. అలా అని రిజెక్ట్ అవ్వదు. వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది.
ఇలాంటి సమయాల్లో ప్రయాణికులకు ఏం చేయాలో అర్థం కాదు.
కంఫర్మ్.. అవుతుందా? లేదా? అన్నది ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందు ప్రిపేర్ చేసే 'ప్రయాణికుల చార్ట్' రెడీ అయ్యేవరకు చెప్పలేం.
ఒక్కోసారి.. వెయిటింగ్ లిస్టులో ఉండి.. ఉండి.. రిజెక్ట్ అవుతుంటది. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులు చేసేదేమి లేక.. ఇతర మార్గాలను చూసుకుంటూ ఉంటారు.
ఇకపై ఆ బాధలు అక్కర్లేదు. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. విమాన టికెట్ ఉచితంగా పొందొచ్చు. దీని ద్వారా జర్నీని పూర్తి చేసుకోవచ్చు.
అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.
ఐఆర్‌సీటీసీకి చెందిన అధికారిక భాగస్వామి 'ట్రైన్ మ్యాన్' యాప్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
ట్రైన్ మ్యాన్ యాప్ 'ట్రిప్ అష్యూరెన్స్' అనే సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కానివారికి విమాన ప్రయాణం ఉచితంగా అందిస్తామంటోంది.
అయితే.. ఇందుకోసం ప్రయాణికులు.. వారి ట్రైన్ టికెట్లను ట్రైన్ మ్యాన్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకు.. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందనుకుందాం.
ఇప్పుడు మీరు ట్రైన్ మ్యాన్ యాప్‌లోని ప్రిడిక్షన్ మీటర్ ద్వారా ఎంత వరకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకోవచ్చు.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ట్రైన్ టికెట్ 'చార్ట్ ప్రిపరేషన్' కన్నా ముందు కన్ఫర్మ్ కాకపోతే.. అప్పుడు మీకు ట్రిప్ అష్యూరెన్స్ అనేది లాస్ట్ మినిట్ ట్రావెల్ ఆప్షన్స్ లో చూపిస్తుంది.
టికెట్ ప్రిడిక్షన్ మీటర్ లో 90 లేదా ఆపై ఉంటే.. ట్రైన్ మ్యాన్ ట్రిప్ అష్యూరెన్స్ చార్జ్ రూ.1 వసూలు చేస్తుంది.
అదే 90 కన్నా దిగువున ఉంటే.. అప్పుడు కంపెనీ నామమత్రపు చార్జీలను వసూలు చేస్తుంది. అంటే.. ప్రిడిక్షన్ మీటర్ ఆధారంగా చార్జీ మారుతుంది.
అలాగే టికెట్ కన్ఫర్మ్ అయితే ఈ ట్రిప్ అష్యూరెన్స్ చార్జీని రిఫండ్ చేస్తారు.
ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే ట్రైన్‌మెన్ ఉచితంగా ఫ్లైట్ టికెట్ అందిస్తుంది.
ఐఆర్‌సీటీసీ రాజధాని ట్రైన్స్ అన్నింటికీ ఈ ట్రిప్ అష్యూరెన్స్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
అలాగే 130 ఇతర ట్రైన్స్‌కు కూడా ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
కాగా, ట్రైన్ ప్రిడిక్షన్ మీటర్ అనేది 94 శాతం ఖచ్చితత్వంతో పని చేస్తోందని కంపెనీ పేర్కొంటోంది.
ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు ట్రైన్‌మెన్ ప్రయాణికులకు ఉచితంగా విమాన టికెట్ అందిస్తుంది.
ఇక్కడ మరో విషయం గుర్తించుకోవాలి. ట్రిప్ అష్యూరెన్స్ ఫెసిలిటీ అనేది ఎయిర్‌పోర్ట్స్ ఉన్న సిటీలకు మాత్రమే వర్తిస్తుంది.