నల్లని పొడవైన కురులు ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఇందు కోసం ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు.
మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల షాంపులు, హెయిర్ ఆయిల్స్ ను వాడుతుంటారు.
అనేక రకాల షాంపులు, ఆయిల్స్ వాడినా ఫలితం మాత్రం రాకపోవడంతో అమ్మాయిలు నిరుత్సాహపడుతున్నారు.
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు జుట్టు తొందరగా పెరగాలని జుట్టు చివర్లను కట్ చేస్తున్నారు.
జుట్టు చివర్లను కట్ చేయడం వల్ల తొందరగా, పొడవుగా పెరుగుతుందని అనుకుంటుంటారు.
జుట్టు చివర్లను కత్తిరించడం వల్ల నిజంగానే జుట్టు పొడవుగా పెరుగుతుందా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లని అందమైన కురులు పొడవుగా పెరగాలని ప్రతీ అమ్మాయి జుట్టు చివర్లను కట్ చేస్తున్నారు.
జుట్టు చివర్లను కట్ చేయడం ద్వారా జుట్టు తొందరగా, పోడవుగా పెరుగుతుందని నమ్ముతుంటారు.
దీనిపై స్పందించిన ప్రముఖ నిపుణులు మరోలా చెబుతున్నారు. జుట్టు కొన భాగాలను కత్తిరించడం వల్ల జుట్టు పెరుగుదలలో ఎలాంటి మార్పు ఉండదని తెలియజేస్తున్నారు.
జుట్టు పెరుగుదల అనేది కుదుళ్ల నుంచి ఉంటుందని, జుట్టు చివర్లలో కాదని నిపుణులు అంటున్నారు.
జుట్టు చివర్లను కట్ చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందనేది అమ్మాయిల అపోహ మాత్రమేనని నిపుణులు కుండబద్దలు కొట్టారు.
కాకపోతే జుట్టు చివర్లను కత్తిరిస్తే ఆరోగ్యంగా తయారవుతాయని మాత్రం చెబుతున్నారు.
అయితే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మాత్రం ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారిగా కత్తిరిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన పాయింట్స్, మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. యూజర్స్ గమనించగలరు.