గర్భం దాల్చిన తర్వాత చాలా మంది ఆడవారు పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తీసుకుంటారు.
దాని వల్ల పుట్టబోయే బిడ్డ అందంగా, తెల్లగా పుడతారని భావిస్తారు. మరి ఇది ఎంతవరకు నిజం.. నిపుణులు ఏం చేబుతున్నారంటే..
కుంకుమ పువ్వులో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయన్నది నిజం.
కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల గర్భిణీ శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది అంటున్నారు నిపుణులు
అలానే కండరాలు రిలాక్స్ అయ్యే గుణాలు కుంకుమ పవ్వులో ఉండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంటారు.
అలానే శిశువుకు కూడా రక్త సరఫరా బాగా జరగటం వల్ల పుట్టబోయే బిడ్డ చర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుందట.
అంతేతప్ప.. కుంకుమ పువ్వుకు.. పుట్టబోయే బిడ్డ రంగుకు సంబంధం లేదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
తల్లిదండ్రుల జీన్స్ మీదనే పుట్టబోయే బిడ్డ రంగు ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది.
ఇక బిడ్డకు మంచిది కదా అని.. ఎక్కువ మోతాదులో కుంకుమ పువ్వు తీసుకుంటే ప్రమాదం అంటున్నారు వైద్యులు.
గర్భిణీలు రోజుకు 10 మిల్లిగ్రాములకు మించకుండా కుంకుమ పువ్వు తీసకోవాలి.
ఎక్కువ అయితే.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
అలానే మూడో నెల తర్వాత నుంచి కుంకుమ పువ్వును తీసుకోవచ్చునని.. పాలలో కాని, తినే ఆహార పదార్థాలలో కాని కలిపి తీసుకోవచ్చు అంటున్నారు.
కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల పిల్లలు అందంగా పుడతారనేది వాస్తవం కాదన్నమాట. కాకపోతే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కోసం వాడటం మంచిదే.