భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది. కన్నవారిని, పుట్టింటి బాంధవ్యాన్ని వదులుకుని ఆడపిల్ల మెట్టినింట అడుగుపెడుతుంది. అలాంటి భార్యను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా, ఆనందంగా ఉండేలా చూసుకోవాలి.

భర్త విషయానికి వస్తే.. అతను కూడా కుటుంబ భారాన్ని మోస్తూ ఇంట్లో వాళ్ల అవసరాలను తీరిస్తూ నిరంతరం కష్టపడుతూ ఉంటాడు. అలాంటి భర్తకు భార్య ఎంతో గౌరవం ఇవ్వాలి.

దానికన్నా ముఖ్యంగా అతనిని ప్రేమగా చూసుకోవాలి. గతంలో అయితే భర్త కష్టపడి వస్తే.. భార్య ఇంటిని చక్కపెట్టేది. భర్త రాగానే సేవలు చేసుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.

ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అంతేకాకుండా ఆఫీస్‌ లో ఒత్తిడిని ఒకరిపై ఒకరు చూపించుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు.

అయితే అలాంటి ఒత్తిడి మీ వివాహ బంధాన్ని సైతం నాశనం చేయచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి.

ఒకరికి ఒకరు సమయాన్ని కేటాయించుకోవాలి. వెనుకటి రోజుల్లో అయితే పెద్దలు కూడా పెళ్లైన వాళ్లకి సమయాన్ని ఇచ్చేవాళ్లు. దంపతులు ఆనందంగా గడిపేలా ప్రోత్సహించేవారు.

ఇప్పుడు భార్యాభర్తలు మాత్రమే సిటీల్లో కలిసి ఉండంటం, ఆదివారాలు కూడా ఓటీలు చేస్తూ కాలం గడిపేయడం చూస్తున్నాం. ఇంకొందరు ఏమైనా ఇబ్బంది ఉంటే భాగస్వామితో మాట్లాడకుండా బయటివారితో డిస్కషన్స్ పెడుతూ ఉన్నారు.

అవన్నీ తప్పు అలా చేయకూడదు. దీనికి ప్రధానంగా చేయాల్సింది మీరు ఒత్తిడిని అధిగమించాలి. మీ భాగస్వామితో బంధాన్ని బలపరుచుకోవాలి. అలా చేయాలి అంటే ఈ సింపుల్‌ చిట్కాని ఫాలో అవ్వండి.

బలహీన పడుతున్న బంధాలను బలపరుచుకునేందుకు.. ఓ చిన్న చిట్కాని ఫాలోకావాలంటూ.. ఫ్యామిలీ, మ్యారేజ్‌ కౌన్సిలర్ పద్మా కమలాకర్ చెబుతున్నారు. ఆవిడ సజెస్ట్‌ చేస్తున్న చిట్కా ఏంటి అంటే భార్యాభర్తలు కలిసి స్నానం చేయడం.

అవును మీరు చదివింది నిజమే.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసే స్నానం చేయండి. అయితే ఈ విషయం వినగానే చాలామంది ఛీ అనుకోవచ్చు. అయితే మీరు భార్యాభర్తలు అనే విషయాన్ని మర్చిపోవద్దు.

అలాగే సినిమాలో చూపించేది రియల్‌ లైఫ్‌ చేసేది ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. అయితే రియల్‌ లైఫ్‌లో జరిగేదే సినిమాల్లో చూపిస్తారు అని గుర్తుంచుకోవాలి.

అలా కలిసి స్నానం చేయడం వల్ల మీ మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు.

మీ ఉరుకుల పరుగులు జీవితం, ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు ఇలా వాటి వల్ల కుదరు అని అనుకోవచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి.. మీకు మీ భార్య, మీ భర్త కన్నా ఈ లోకంలో ఏ బంధం, ఏ బాధ్యత ఎక్కువ కాదు.

ఇద్దరూ కలిసి వంటింట్లో పనుల్లో హెల్ప్‌ చేసుకోండి. భోజనం చేసిన తర్వాత సరదాగా బయటకు వెళ్లిరండి. ఇలా రోజూ చేయాల్సిన అవసరం లేదు.

నెలలో ఇలా ఒకరోజు మీకోసం మీరు కేటాయించుకోండి. సంసారంలో ఎలాంటి గొడవలు, అరమరికలు రావడానికి ఆస్కారం ఉండదు అంటూ పద్మా కమలాకర్‌ సూచిస్తున్నారు.