ఈ మధ్యకాలంలో వాట్సాప్ అంటే తెలియని వారు లేరు.

ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్స్ తో యూజర్స్ కి బెస్ట్ ఇస్తోంది.

మల్టీ డివైజ్ కనెక్టింగ్ ఫీచర్ ద్వారా ఒకే యూజర్ తన వాట్సప్ అకౌంట్ 4 డివైజ్లలో వాడే అవకాశం

ఒక డివైజ్లో చేసిన ఛాటింగ్ ఆటోమేటిక్ గా మరో డివైజ్లో సింక్ అయిపోతుంది.

చాటింగ్, మెసేజెస్, పిక్స్, వీడియోలు, కాల్స్ అన్నింటికీ ఎండ్ టు ఎంట్ ఎన్క్రిప్షన్ లభిస్తుంది.

ఇదివరకు వాట్సప్ను వెబ్ వర్షన్ లేదా బ్రౌజర్లో వాడాలంటే స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టీవ్గా ఉండాలి.

వాట్సాప్ న్యూ ఫీచర్ ద్వారా..  స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా వేరే డివైస్ లలో వాడుకునే అవకాశం.

అదెలాగంటే.. ముందుగా  మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ ఓపెన్ చేయండి.

రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉండే త్రీ డాట్ ఐకాన్ క్లిక్ చేయండి.

Linked devices పైన క్లిక్ చేసి.. Multi-device beta ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత Join Beta పైన క్లిక్ చేసి.. Continue పైన క్లిక్ చేయాలి.

వాట్సప్ వెబ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ స్మార్ట్ఫోన్కు లింక్ చేయాలి.

ఆ తర్వాత మీ స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు.

మెయిన్ డివైజ్ 14 రోజులు యాక్టీవ్ గా లేకపోతే మిగతా డివైజ్ లలో ఆటోమెటిక్గా వాట్సప్ లాగౌట్ అయిపోతుంది.