సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్/ డెస్క్ టాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. ఫోటో బ్లర్ చేసే ఫీచర్.

దీని ద్వారా అవతలి వ్యక్తికి పంపాలనుకున్న ఫొటోలో కొంతభాగం లేదా మొత్తాన్ని బ్లర్ చేయొచ్చు.

ఉదాహరణకు.. మనం ఎవరికైనా ఒక ఫోటో పంపాలి అనుకోండి. మన దగ్గర సింగిల్ గా ఉన్న ఇమేజ్ లేదు.

నలుగురితో కలిసి దిగాం. అలంటి సమయాల్లో ఈ  ఫీచర్ ని ఉపయోగించి.. మిగిలిన ముగ్గురిని బ్లర్ చేయొచ్చన్నమాట.

స్మార్ట్ ఫోన్ వాట్సాప్ లో ఇమేజ్ బ్లర్ చేసే విధానం..

స్టెప్ 1: ముందుగా స్మార్ట్‌ఫోన్‌/ కంప్యూటర్ లో WhatsApp ఓపెన్ చేయండి.  

స్టెప్ 2: మీరు ఫోటోను ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి యొక్క చాట్‌ని తెరవండి.

స్టెప్ 3: అటాచ్‌మెంట్ చిహ్నంపై క్లిక్ చేయండి. 

స్టెప్ 4: గ్యాలరీ ఎంపికకు వెళ్లి చిత్రాన్ని ఎంచుకోండి.  

స్టెప్ 5: ఇప్పుడు WhatsApp యొక్క ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 6:  స్క్రీన్ కుడి ఎగువ మూలలో అందుబాటులో ఉన్న పెన్ టూల్‌పై నొక్కండి.

స్టెప్ 7:  ఇప్పుడు స్క్రీన్ దిగువన అందుబాటులో ఉన్న బ్లర్ చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 8:  ఫోటో యొక్క అవసరం లేని భాగాన్ని బ్లర్ చేయండి. 

స్టెప్ 9:  ఫోటో యొక్క అవసరం లేని భాగాన్ని బ్లర్ చేయండి.