మన తిన్నే ఆహార పదార్ధల్లో  రుచికి ప్రధాన కారణం సుగంధ ద్రవ్యాలు.

ఈ సుగంధ ద్రవ్యాలను మన వాడుక భాషలో మసాల దినుసులు అని పిలుస్తారు.

ఈ దినుసులు కేవలం రుచి కోసమే కాక మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

అందుకే మన పూర్వీకులు ఈ సుగంధ ద్రవ్యాలను ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తుండేవారు. 

ఈ సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన దాల్చిన చెక్క చర్మం విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.

చర్మంపై దాల్చిన చెక్కను ఉపయోగించడం గురించి చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. 

దాల్చినచెక్కను పూయడం వల్ల చర్మంపై ఎర్రగా మారుతుందని ఎక్కువమంది అనుకుంటారు

దాల్చిన చెక్క యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

దాల్చిన చెక్క మొటిమల సమస్యలను నివారించడం, మచ్చలను తొలగిచడంలో సాయపడుతోంది.

ముఖంపై మొటిమలను, వాటి మచ్చలను వదిలించుకోవడానికి దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు

చర్మం వృద్ధాప్యాన్ని, ముడతలను నివారించడానికి కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు

గుడ్డులోని తెల్లసొనను దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి చర్మానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది

శీతాకాలంలో పెదవుల సంరక్షణ కోసం కూడా దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు

దాల్చిన చెక్కను ఉపయోగించి చర్మాన్ని నిత్యం కాంతివంతగా ఉంచుకోవచ్చు.

చర్మం విషయంలోనే కాకుండా దాల్చిన చెక్క.. ఇతర ఆరోగ్య విషయంలోనూ ఎంతో తోడ్పడుతుంది.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా తెలుపబడింది. అవగాహన కోసం వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.