బిళ్ళ గన్నేరు మొక్క గురించి వినే ఉంటారు. ఒకరి ప్రమేయం లేకుండా దానంతట అదే మొలుస్తుంది. బోలెడన్ని పూలు పూయిస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో ఔషధ తయారీకి ఈ బిళ్ళ గన్నేరు మొక్కలను ఉపయోగిస్తారు.    

రక్తపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేయడంలో ఈ బిళ్ళ గన్నేరు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్యాన్సర్ ని నియంత్రించే ఔషధాల్లో ఈ బిళ్ళ గన్నేరు మొక్కను ఉపయోగిస్తారు.

ముక్కు నుంచి రక్తం కారడం, దంతాలు, చిగుళ్ల సమస్యలు, గొంతు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నయం చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది.

దద్దుర్లు, దురదలు వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఈ మొక్క అద్భుతంగా పని చేస్తుంది

ఈ మొక్క వీరుని రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. 

ఒక గ్లాస్ నీరు అయ్యేలా మరిగించి.. ఆ తర్వాత ఆ నీటిలో మిరియాల పొడి కలిపి.. ఆ రసాన్ని తాగాలి. 

ఇలా 48 రోజుల పాటు తాగితే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

ఇదే బిళ్ళ గన్నేరు మొక్క వేరు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి.

మొలల సమస్య ఉన్నవారు ఈ బిళ్ళ గన్నేరు పూల రేకులను నీటిలో కలిపి కషాయంలా తయారుచేసుకోవాలి. 

ఈ మిశ్రమంతో మొలలను కడుగుతూ ఉంటే.. మొలల సమస్య తగ్గుతుంది.

బిళ్ళ గన్నేరు మొక్క ఆకులను, పూలను మెత్తగా నూరుకుని.. అందులో పెరుగు, కొబ్బరి నూనె కలపాలి. 

ఆ మిశ్రమాన్ని జుట్టుకు పూసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు చుండ్రు, జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి.

పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు శరీరంలో కుట్టిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల పేస్ట్ ని రాస్తే గాయాలు తగ్గుతాయి. నొప్పి, వాపు ఉంటే తగ్గుతాయి.

బిళ్ళ గన్నేరు మొక్క ఆకులను శుభ్రంగా కలిగి.. ఆరబెట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. 

మరిగించగా తయారైన మిశ్రమాన్ని కండరాలపై మర్దనా చేస్తే కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి

అయితే బిళ్ళ గన్నేరు మొక్కను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వాడకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ చిట్కాను పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.