బాదాన్ని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బాదం మాత్రమే కాదు.. దాని నూనె కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

బాదం నూనెతో ఎన్నో సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  

ఆయుర్వేదంలో కూడా బాదం నూనెను అనేక ఔషదాలలో ఉపయోగిస్తారు.

బాదం నూనెలో కొవ్వులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, జింక్, కాపర్ అనే పోషకాలు ఉంటాయి.

అలానే మాంగనీస్,  మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాదం నూనెలో ఉంటాయి.

బాదం నూనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంది.

బాదం నూనెను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి మంచిది.

 స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ స‌మ‌స్యల‌కు చెక్ పెట్టడంలో బాదం నూనె బాగా సాయప‌డుతుంది.

మొటిమ‌ల స‌మ‌స్యతో బాధపడే వారు బాదం నూనెలో తేనె మిక్స్ చేసి..ముఖానికి అప్లయ్ చేయాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు, మ‌చ్చలు న‌యమవుతాయి.

బాదం నూనెలో కొద్దిగా నిమ్మర‌సం మిక్స్ చేసి.. ముఖానికి రాసుకోవాలి చేయాలి.

అనంత‌రం ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి.

ఇలా బాదం నూనె వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు త‌గ్గి య‌వ్వనంగా కూడా మారుతుంది.