ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండటం అనేది మన వల్ల అయ్యే పనికాదు. వాటి జోలికి వెళ్లనంత వరకే మన ఆరోగ్యం బాగుంటుంది.

ఒకవేళ వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అలా కాకూడదంటే ఈ చిట్కాలు పాటించండి.

 ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత గోరువెచ్చని నీరు తాగడం శరీరానికి ప్రయోజనకరం.

వేడి నీటిని తాగడం వల్ల.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో అదనపు నూనె చేరకుండా.. వేడి నీరు నిరోధిస్తుంది.

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో తగినంత యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి.

ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్ తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.

హెవీ ఫుడ్ తిన్న తర్వాత సోంపు, వాము నీరు తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఈ రెండు కూడా మనల్ని ఫిట్ గా ఉంచుతాయి. బరువును తగ్గించడంలోనూ ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత పెరుగులో జీలకర్ర కలిపి తింటే చాలా మంచిది.

పెరుగులో ఉండే లాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా.. గ్యాస్, అజీర్ణం తదితర సమస్యలని నివారిస్తుంది. 

ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత తృణధాన్యాలు తింటే శరీరానికి మంచిది.

వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

తృణధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచకుండా తగ్గిస్తాయి.