మీరు గృహిణులా..? ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా..? అయితే.. ఈ బిజినెస్ మీకోసమే.

ఇంట్లో ఖాళీగా ఉంటూ సమయాన్ని వృథా చేసుకోకుండా ఈ వ్యాపారం చేస్తే.. ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? లాభాలు ఎలా ఉంటాయి..? అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం..

సునామీ.. భూకంపం వంటి ప్రకృతి విపత్తులు ముంచుకొచ్చి ప్రపంచం మునిగిపోతున్నా అందం మీద మనుషులకు ఏమాత్రం ఇంట్రెస్ట్ తగ్గదు.

నలుగురిలో అందంగా కనిపించాలని ముస్తాబవుతుంటారు. వేలకు వేలు వెచ్చించి బ్యూటీ పార్లర్ కు పరుగులు పెడుతుంటారు. దీన్నే బిజినెస్ గా మలుచుకోండి.

బ్యూటీ పార్లరా..? అని తీసిపారేయకండి. ఇదొక లాభదాయకమైన వ్యాపారం.. అభివృద్ధి చెందుతున్న వ్యాపారం.

కోవిడ్ లాంటి సంక్షోభం సమయంలోనూ ఈ బిజినెస్ కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదంటే అర్థం చేసుకోండి.. ఈ వ్యాపారం ఎంత లాభదాయకమైనదో..

ఈ వ్యాపారం చేస్తూ ఎంతోమంది మహిళలు లక్షల ఆదాయాన్ని గడించారు.. గడిస్తున్నారు కూడాను.

కావున మీరు కూడా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటే ఈ వ్యాపారం సరైనదని చెప్పొచ్చు.

బ్యూటీ పార్లర్ ఎలా ప్రారంభించాలంటే..

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా మీరు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకొని ఉండాలి లేదా ఏదేని పార్లర్ లో శిక్షణ అయినా తీసుకోని ఉండాలి.

ఇంట్లో ఉండే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు కావున మహిళలకు ఎలాంటి అనుమానాలు.. సందేహాలు అక్కర్లేదు.

మీ చుట్టు పక్కలవారే.. మీ కస్టమర్లు. ఒకవేళ ఎక్కువ ఆదాయం కావాలనుకుంటే మాత్రం.. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి.

పెట్టుబడి.. లాభనష్టాలు

ఇంట్లోనే ఈ వ్యాపారం ప్రారంబించాలనుకుంటే పెద్దగా పెట్టుబడి అవసరముండదు. 

కేవలం 15వేల పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. పార్లర్ కు అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అదే పెద్ద ఎత్తున పెట్టాలనుకుంటే మాత్రం లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇక లాభాల విషయానికొస్తే.. ఇది మీ పని విధానంపైనే ఎక్కువుగా ఆధారపడి ఉంటుంది. మీరు వినియోగదారులకు నచ్చేలా ఉంటే ఆటోమెటిగ్గా వారు మీ వద్దకు వస్తారు. 

వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. అంతేకాదు కస్టమర్ల ఇంటికి వెళ్లి సేవలందించడం ద్వారా మీరు మరింత సంపాదించవచ్చు.

ఇంకా చెప్పాలంటే.. మీరు ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడం, బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మడం, బ్యూటీ థెరఫీ చేయడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు.

ఇంకా  మెహందీ పెట్టడం నేర్చుకున్నట్లయితే పెళ్లిలకు, ఫంక్షన్లకు ఈ సేవలు అందించడం ద్వారా మీరు అదనంగా డబ్బు సంపాదించవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. మహిళలకు సరైన ఉపాధి అందించే ఈ వ్యాపారాన్ని వెంటనే ప్రారంభించండి.

ఈ బిజినెస్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.