ఈ మధ్యకాలంలో  గుండెపోటుతో సంభవించే మరణాల సంఖ్య  బాగా పెరిగిపోయింది.

ఎంతో ఆరోగ్యం కనిపించే వ్యక్తి.. అకస్మాత్తుగా వచ్చే గుండె పోటుతో మరణిస్తున్నాడు.

అయితే ఈ గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాల ద్వారా ముందుగా గుర్తించవచ్చు.

గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది.

గుండెపోటు వచ్చే సమయంలో ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉటుంది.

అలానే ఒళ్లంత చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాలి.

కొందరు గుండెపోటును గ్యాస్‌ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

నేటికాలంలో గుండె పోటు వయస్సుతో సంబంధంలేకుండా యువకులకు కూడా వస్తుంది.

మరి కొందరికి జన్యుపరంగా గుండెపోటు అనేది వస్తుంది.

అయితే గుండెపోటు వచ్చిన వ్యక్తికి  అత్యవసరంగా ASPIRIN 325 mg, Sorbitrate 5 mg మాత్రలు రెండు ఉన్నాయి.

గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రిలో చేరితో అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

తర్వాత పేషేంట్‌ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తారు.

గుండెపోటు రాకుండా ఉండాలంటే మద్యపానం, ధుమపానం మానాలి.

రోజూ తప్పని సరిగా పరిమిత స్థాయిలో  వ్యాయమం చేయడం వలన గుండె పోటు నివారించవచ్చు.

రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్‌ నియంత్రణలో ఉంచుకోవాలి.

 కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి గుండె పోటు రాకుండా చూసుకోండి.