మనం అనుకున్న పని, అనుకున్న సమయానికి జరగాలంటే కావాల్సిందే టైమ్ మేనేజ్ మెంట్.

మనం సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకున్నప్పుడే ఏ విషయంలోనైనా సరే సక్సెస్ అవ్వగలుగుతాం.

ఇల్లు, ఆఫీస్.. ఇలా ఎక్కడైనా సరే రోజూవారీ జీవితంలో సమయపాలన చాలా ముఖ్యం.

టైం మేనేజ్ మెంట్ అంటే.. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా సరిగా ప్లాన్ చేసుకోవడమే.

రోజులో ఏ పని ఎంత టైంలో చేయాలో ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే అవాంతరాలు ఉండవు.

ఓ రోజు లేదా వారంలో మీరు చేయాల్సిన పనుల కోసం ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి.

పనులు వారీగా ఏది ఎప్పుడెప్పుడు చేయాలి అనేది షెడ్యూల్ చేసి పెట్టుకోండి.

మీరు చేయాల్సిన పనుల్లో.. అత్యంత ముఖ్యం, ముఖ్యమే కానీ తొందర లేదు, ముఖ్యం కాదు.. ఇలా కేటగిరీస్ విభజించుకోవాలి.

పైన పనులని డివైడ్ చేసిన దానికి అనుగుణంగా సమయాన్ని కేటాయించుకోవాలి.

పనులకు పట్టే సమయాన్ని ముందుగానే ఓ అంచనా వేయగలగాలి. అప్పుడే పక్కాగా జరుగుతుంది.

లేకపోతే ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. దానితో పాటే టైమ్ కూడా వృథా అవుతుంది.

లైఫ్ ఎంత బిజీగా ఉన్నాసరే ఖాళీ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఆ సమయాన్ని మీకు నచ్చిన పనుల కోసం ఉపయోగించుకోండి.

మీరు చేయాల్సిన పనుల లిస్ట్ ని ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోండి.

చిన్న నోట్స్ లేదంటే మొబైల్ యాప్స్ సాయంతో మీరు చేయాల్సిన, చేస్తున్న పనుల్ని ట్రాక్ చేస్తూ ఉండండి.

షెడ్యూల్ చేసుకోవడం మాత్రమే కాదు.. దాన్ని సరిగా అమలు చేయడం మరో ఎత్తు.

ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా అనుకున్నట్లు పని పూర్తయితే మీరు సకెస్స్ అయినట్లే.