ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు... అందంగా కనబడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఫేస్ క్రీములు వాడటం దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ కు వెళ్లడం వరకు ఫాలో అయిపోతున్నారు.

ఈ క్రమంలోనే రోజూ యంగ్ గా కనిపించడం కోసం పోషకాలు ఉండే ఫుడ్ తినడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం.

అయితే వయసు పెరిగినట్లు చేసే వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉండాలంటే మాత్రం ఈ పాలు తాగాల్సిందేని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ యంగ్ లుక్ లో కనిపించాలని అనుకునేవాళ్లు.. కొవ్వు శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

5834 మంది యూత్ పై కొన్నేళ్లు అధ్యయనం చేసిన తర్వాత నిపుణులు ఈ విషయాన్ని కనుగొన్నారు. 

కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు తాగిన వారి కన్నా.. కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు తాగిన వారు ఎంతో యవ్వనంగా ఉన్నట్లు గుర్తించారు.

టోన్డ్ పాలు తాగేవారు.. నార్మల్ ఏజ్ కన్నా నాలుగేళ్లు తక్కువగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా కణ విభజన జరిగినప్పుడు.. టెలోమెర్ల పొడుగు తగ్గుతుందని, దీంతో వృద్ధాప్య ఛాయలు కనబడతాయని అంటూ ఉంటారు.

ఎవరైతే కొవ్వు శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలు తాగుతారో వారిలో టెలోమెర్ల పరిమాణం తగ్గే వేగం చాలా తక్కువగా ఉంటుంది.

దీని వల్ల వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఆలస్యమవుతుందని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

ఈ క్రమంలోనే రోజూ యంగ్ గా కనిపించడం కోసం పోషకాలు ఉండే ఫుడ్ తినడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం.

ఇలా నిత్యం యంగ్ గా కనిపించాలంటే ఇలాంటి పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పైన టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.