ప్రస్తుతం అందరికీ ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉంటూనే ఉన్నాయి.

కొందరికి వీటిలో లైక్స్‌ చూపించుకోవడం అంటే ఇష్టం.. ఇంకొందరికి మన లైక్స్‌ మరెవరో ఎందుకు చూడాలి అని కూడా అనుకుంటారు.

ఇంకొందరు తక్కువ లైక్స్ వస్తున్నాయని చికాకుగా కూడా ఫీలవుతుంటారు.

అయితే అలాంటి వారు ఇన్ స్టాగ్రామ్ లైక్స్ ను ఎలా హైడ్ చేసుకోవాలో చూడండి.

యాప్ ఓపెన్ చేసిన తర్వాత.. కుడివైపున ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

కిందకు స్క్రోల్ చేశాక.. మీరు ఏ పోస్టుకు లైక్స్ కౌంట్ హైడ్ చేయాలనుకుంటే ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి.

కుడివైపున త్రీడాట్ ఐకాన్ క్లిక్ చేయండి.

ఆ తర్వాత చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో Hide Like Count పైన క్లిక్ చేయండి.

ఒకవేళ తర్వాత మీరు ఈ ఆప్షన్ను డిసేబుల్ చేయాలనుకుంటే.. సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి Unhide Like Countని సెలెక్ట్ చేసుకోండి.

మీరు ఏదైనా పోస్ట్ చేయబోయే ముందు కూడా ఈ హైడ్ మై లైక్ కౌంట్ని ఎనేబుల్ చేయచ్చు.

ముందుగా మీరు పోస్ట్ చేయాలనుకునే ఫోటో సెలెక్ట్ చేయాలి.

ఆ ఫోటోకి క్యాప్షన్ యాడ్ చేయాలి.

ఆ తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Hide Like and View Counts బటన్ సెలెక్ట్ చేసుకోవాలి.

చూశారుగా ఎంతో సింపుల్ గా మీ ఇన్ స్టాగ్రామ్ లైక్ కౌంట్ ని హైడ్ గానీ, అన్ హైడ్ చేసుకోవచ్చు.