వేసవి మొదలైపోయింది.. ఇప్పుడిప్పుడు సూర్యరశ్మి కూడా పెరుగుతూ ఉంది.
ఎండలు ముదిరేకొద్దీ చాలా మందికి చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి.
ముఖం మొత్తం జిడ్డు బారి పోవడం, వేడికి చర్మం పొడి బారడం అవుతుంది.
అంతేకాకుండా ఎండలకు మొటిమల సమస్య కూడా తలెత్తుతూ ఉంటుంది.
అయితే చాలామంది చర్మాన్ని పట్టించుకోరు.. అలా చేయడం వల్ల మీరు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఈ సింపుల్ టిప్స్ ని గనుక మీరు ఫాలో అయితే మాత్రం.. ఈ వేసవిలో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అవసరం అయితేనే ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాలి.
ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. చర్మాన్ని కప్పుకుంటూ జాగ్రత్త పడాలి.
క్రమం తప్పకుండా మంచినీళ్లు తాగాలి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
సమ్మర్ లో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. స్నానానికి ముందు ఐదైనా ఎసెన్షియల్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.
సమ్మర్ లో వాక్సింగ్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలా చేస్తే చర్మం మరింత ఇరిటేట్ అవుతుంది.
ఒకవేళ వ్యాక్సింగ్ తప్పదు అనుకుంటే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెలకి ఒక్కసారే వాక్సింగ్ చేసుకుంటే మంచిది.
వేసవిలో విమటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పండ్లు, కూగాయలు ఎక్కువగా తినాలి.
వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ జూస్ ఎక్కువగా తాగితే మంచిది.
బయటకి వెళ్లేందుకు 20 నిమిషాల ముందే లోషన్ రాసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.