భార్యాభర్తల మధ్య శృంగారం అనేది ఓ సర్వసాధారణ విషయం. ఇద్దరి మధ్యా బంధాన్ని దృఢపర్చడానికి శృంగారం ఎంతో తోడ్పడుతుంది. తాళితో ఒక్కటైన బంధం కలయికతో బలపడుతుందన్నది నిర్వివాదాంశం. అయితే, ఆడవారితో పోల్చుకుంటే మగవారికి శృంగారపరమైన వాంఛలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది పురుషులు ప్రతీ రోజూ శృంగారాన్ని కోరుకుంటారు.

అయితే, ఇలా ప్రతీ రోజూ శృంగారానికి అందరి భాగస్వాములు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వీటికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతీరోజూ శృంగారం అసాధ్యమైన పని. ఎందుకంటే ఇద్దరి మానసిక, శారీరక సమస్యలు ఇందుకు ప్రోత్సహించకపోవచ్చు.

కానీ, వారంలో కొన్ని రోజులైనా భార్యతో శృంగారంలో పాల్గొనాలంటే కచ్చితంగా కొన్ని పద్దతుల్ని పాటించాలి. వీటిని పాటించటం వల్ల భాగస్వాములు మీతో శృంగారానికి సుముఖత వ్యక్తం చేస్తారు. అవేంటంటే..

వ్యక్తిగత పరిశుభ్రత  శృంగారానికి వ్యక్తిగత పరిశుభ్రతకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్యా శృంగారాన్ని అస్వాధించాలంటే శుభ్రమైన శరీరాలు కావాలి.

కంపుకొట్టే శరీరంతో శృంగారంలో పాల్గొంటే ఇద్దరికీ ఇబ్బందే. అందుకే శృంగారం సమయంలో సుచిగా, శుభ్రంగా ఉండాలి. పళ్లను, శరీరాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి.

దీని వల్ల మనలో కోర్కెలు మరింత పెరుగుతాయి. శృంగారం సమయంలో మంచి అనుభూతి వస్తుంది.

భార్య ఇష్టాఇష్టాలు  భర్త ఎప్పుడూ భార్యను శృంగార బొమ్మలా చూడకూడదు. ఆమెకంటూ ఓ మనసుందని గుర్తించాలి. ఆమె ఇష్టాఇష్టాలు ఎంటో మనం తెలుసుకుని మసులుకుంటే.. మన ఇష్టాలకు వారు ప్రాధాన్యత ఇస్తారు.

అంతేకాదు! అలాంటి వారితో ఆడవాళ్లు అనుభవపూర్వకమైన శృంగారాన్ని పొందలేరు.

శృంగారం సమయంలో అభ్యంతరాలు పడక గదిలో భార్య తమకు నచ్చినట్లుగా ఉంటే భర్తలు ఎంతో సంతోషిస్తారు. కానీ, భార్యలకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయ్‌, ఇలా చేయ్‌ అని చెప్పటమే కానీ, అవతలి వారి మనసును అర్థం చేసుకోరు.

ఇలా చేస్తే భార్యకు భర్తపై అసహ్యం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది భర్తలు గడ్డం గుచ్చుకుంటోంది తీసేయ్‌ అంటే వినరు.. ఇలా శృంగారం చేస్తే నాకు నచ్చదు అంటే వినరు..  ఆమెకు నచ్చని పనినే పదేపదే చేయిస్తుంటారు. అలా చేస్తే శృంగార జీవితం దెబ్బ తింటుంది.

భార్యను అర్థం చేసుకునే తత్వం భార్యను శృంగారపరంగా గెలవాలనుకునే భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అర్థం చేసుకునే గుణం. పైవన్నీ ఈ ఒక్క దాంతో వచ్చేస్తాయి. మొత్తం కాకపోయినా.. శృంగారం విషయంలోనైనా ఆమెను అర్థం చేసుకోగలగాలి.

ఆమెకు ఇష్టంలేదు అని కచ్చితంగా చెబితే ఆరోజు వదిలేయాలి. బలవంత పెట్టకూడదు. ఆమెను బానిసలా చూస్తే.. నిజమైన శృంగార అనుభవాన్ని పొందలేము.

ఆమెను ఎల్లప్పుడూ శృంగారంలో మన సమ ఉజ్జిగానే చూడాలి. ఆమె మూడ్‌ను అర్థం చేసుకుంటూ వెళ్లినప్పుడే నిజమైన అనుభవాన్ని పొందగలుగుతాము.