మనిషికి నీరు అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగాల్సిందే.

మగవాళ్ల శరీరంలో 60 శాతం నీరు ఉండగా.. ఆడవారి శరీరంలో 45 నుంచి 60 శాతం నీరు ఉంటుంది.

రోజుకు ఒక మనిషి 5 లీటర్ల నీరు తాగాలని చెబుతారు.

కానీ నీరు ఎక్కువగా తాగినా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బ తింటుంది.

నీరు అధికంగా తాగడం వల్ల ఓవర్ హైడ్రేషన్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

శరీరానికి కావాల్సిన దాని కంటే అధికంగా నీరు తాగడం వల్ల డైల్యూషనల్ హైపోనాట్రేమియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు.

అలా అని తక్కువగా తాగినా డీహైడ్రేట్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

అందుకే శరీర బరువును బట్టి నీరు తాగాలని సూచిస్తున్నారు.

మీ శరీర బరువు ఎంతుందో చూసి.. దాన్ని 30తో భాగిస్తే ఎంత వస్తుందో అంత మోతాదులో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉంటే గనుక 30తో భాగిస్తే ఫలితం 2 వస్తుంది.

అంటే మీ శరీరం అడిగే నీరు 2 లీటర్లు.

శరీర బరువుకు తగ్గట్టు రోజూ తగిన నీరు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.

ఇలా బరువుకు తగ్గట్టు నీరు ఎంత తాగాలో తెలుసుకుని తాగడం వల్ల శరీరంలో నీటి పరిమాణం తగ్గడం గానీ, పెరగడం గానీ ఉండదని అంటున్నారు.

గమనిక: ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీని గురించి అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.