దీపావళి అంటే దీపాల పండుగ అని మనకి తెలిసిందే. మరి ఆ దీపావళి పండగ రోజు నాడు కనీసం ఎన్ని దీపాలు వెలిగించాలో మీకు తెలుసా?

1వ దీపం: మరణం, దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడానికి మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త పారబోసే చోట దక్షిణ ముఖంగా పెట్టాలి. 

2వ దీపం: రెండవ దీపాన్ని ఖచ్చితంగా నెయ్యితో వెలిగించి పూజ మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

3వ దీపం: సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, కోసం మూడవ దీపాన్ని అమ్మ వారి ఫోటో ముందు వెలిగించాలి. 

4వ దీపం: నాల్గవ దీపాన్ని తులసి మొక్క ముందు ఉంచాలి. ఇక్కడ ఉంచడం వల్ల ఇంట్లో వారికి మనశ్శాంతి, సంతోషం దక్కుతుంది. 

5వ దీపం: నెగిటివ్ ఎనర్జీని నివారించేందుకు ఐదవ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో అందరూ హాయిగా, ఆనందంగా, ప్రేమగా ఉంటారు.  

6వ దీపం: రావి చెట్టుని అదృష్టంగా భావిస్తారు. ఆర్ధిక సంక్షోభం, అనారోగ్య సమస్యల నుంచి బయట పడడం కోసం ఆరవ దీపాన్ని ఆవ నూనెతో వెలిగించి రావి చెట్టు కింద ఉంచాలి.

7వ దీపం: ఇంటి సమీపంలో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఏడవ దీపాన్ని వెలిగించాలి. 

8వ దీపం: ఎనిమిదవ దీపాన్ని చెత్త వేసే చోట ఉంచాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. 

9వ దీపం: ఇంటి యొక్క వాష్ రూమ్ ఏరియాలో తొమ్మిదవ దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ, శ్రేయస్సు కలుగుతాయి.

10వ దీపం: ఇంటి పైన పదవ దీపాన్ని వెలిగించాలి. నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని రక్షిస్తుంది.

11వ దీపం: ఇంట్లోనే ఏదైనా ఒక కిటికీ దగ్గర 11వ దీపం పెట్టాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీతో పోరాడుతుంది.

12వ దీపం: ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరాలంటే ఇంటి పై భాగాన 12వ దీపాన్ని వెలిగించాలి.

13వ దీపం: 13వ దీపాన్ని ఇంట్లో ఏదో ఒక కూడలిలో వెలిగించి పెట్టాలి. ఇలా చేస్తే పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. 

కనీసం 13 వెలిగించాలి. ఆ పైన ఎన్ని వెలిగించినా మంచిదే.