ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
ఈ ఎండల తీవ్రతకు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ అల్లాడుతున్నారు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి బయటపడొచ్చు.
ఎండ తీవ్రత నుంచి మనల్ని కాపాడే వాటిల్లో పుదీనా ఒకటి.
పుదీనా ఆకుల్లో అడాప్టోజెన్ గుణాలు ఉన్నాయి.
అందుకే ఈ పుదీనాతో తయారు చేసిన పానీయం తీసుకుంటే మంచిది.
పుదీనా ఆకుల్లోని శీతలీకరణ శక్తి.. శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
వేసవిలో పుదీనా చట్నీని ఎక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు
పుదీనా చట్నీ మన శరీరా ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పుదీనా చట్నీని మన ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ఔషధంగా పని చేస్తోంది.
పుదీన జ్యూస్ అనేది మన శరీరాన్ని చల్లబరుస్తూ సమతుల్యం చేయడంలో సాయపడుతుంది.
వేసవిలో జీర్ణక్రియ, ప్రేగులోని వేడి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
వాటి వలన పేగు సూక్ష్మజీవులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.
అయితే ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.