పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయనేది మన అందరికి తెలిసిన విషయం తెలిసిందే.

ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పాలను తాగుతూ ఉంటారు.

పాల ద్వారా మనకు సహజ కొవ్వు, క్యాలరీలు, కాల్షియంతో పాటు ప్రోటిన్లు కూడా దొరుకుతాయి.

అయితే చాలా మంది మాత్రం వేడి పాలు తాగాలా? చల్లటి పాలు తాగాలా అనే సందేహం చాలా మందికే ఉంటుంది.

అసలు ఏ పాలు తాగితే ఆరోగ్యానికి మంచింది. నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

చల్లటి పాలను కాకుండా మరిగించిన గోరువెచ్చని పాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

 పాలను మరిగించడం వల్ల అందులో ఉండే హానికరమైన క్రిములు పూర్తిగా నశిస్తాయి.

వేడి పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా వేడి పాలను తాగడం వల్ల ఇంతకు ముందే కంటే మీ శరీరం ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందట.

 గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు పాలను తాగడం చాలా అవసరం.

ఇక నుంచైనా చల్లిటి పాలను కాకుండా మరిగించిన గోరువెచ్చని పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలంటూ పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.