హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. కెరీర్, సినిమాల గురించి ఆలోచిస్తూ దీన్ని వాయిదా వేస్తుంటారు.

కొందరు హీరోయిన్లు మాత్రం మ్యారేజ్ చేసుకున్నప్పటికీ.. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు.

మరికొందరు మాత్రం పెళ్లి చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంటూ ఉంటారు.

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి, విడాకులు అనే మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి.

సరే ఇదంతా పక్కనబెడితే.. తాజాగా హీరోయిన్ హనీరోజ్ పెళ్లికి రెడీ అయిపోయింది. ఆమెనే ఈ విషయం చెప్పుకొచ్చింది.

స్వతహాగా మలయాళీ అయిన హనీరోజ్.. ఎప్పుడో 2005లో నటిగా సినిమా చేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2008లో 'ఆలయం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 2014లో 'ఈ వర్షం సాక్షిగా' అనే సినిమా చేసింది.

ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడంతో హనీరోజ్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

గతేడాది మోహన్ లాల్ 'మాన్ స్టర్'లో నటించిన హనీరోజ్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా రిలీజ్ కు ముందే బాలయ్య 'వీరసింహారెడ్డి'లో ఈమె వన్ ఆఫ్ ది హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

సంక్రాంతికి థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత హనీరోజ్ చాలా ఫేమ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హాట్ నెస్ పెంచిన హనీరోజ్.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

ఈ క్రమంలోనే షాపింగ్ మాల్స్ లాంటి వాటి ఓపెనింగ్స్ తోనూ హనీరోజ్ ఫుల్ బిజీ అయిపోయింది.

తాజాగా విజయవాడలోని ఓ బేకరీ ఓపనింగ్ చేసిన హనీరోజ్.. తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

'పెళ్లి పెద్ద బాధ్యత. నేను రెడీగానే ఉన్నాను. అలానే పెళ్లి బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తాను' అని చెప్పింది.

హనీరోజ్ పెళ్లికి రెడీ అనే వార్త తెలిసి.. వరుడు ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అది మాత్రం హనీరోజ్ సస్పెన్స్ పెట్టేసింది.

త్వరలో హనీరోజ్ పెళ్లిపై వస్తున్న న్యూస్ చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.