తేనె మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని మనందరికీ తెలిసిందే.

తేనె మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని మనందరికీ తెలిసిందే.

అలాగే నువ్వులు కూడా మనకు  ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

వీటిని నిత్య జీవితంలో తరుచూ వాడుతుంటాం కూడా. ముఖ్యంగా వంటల్లో..

ఇక, తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే.. అది కూడా ఉదయాన్నే పరగడపున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి.

ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను ప్రతి రోజూ పెడితే చాలా మంచిది.

తేనె, నువ్వులు రెండింటిలోనూ పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

తేనె, నువ్వులు తిన‌డం వ‌ల్ల‌ శరీరానికి తక్షణ శక్తి దొరకుతుంది.

చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య తగ్గి.. జుట్టు రాలడం ఆగుతుంది.