మనిషి శరీరంలో అత్యంత గట్టిగా  ఉండే భాగాల్లో దంతాలు ఒకటి. ఇవి అత్యంత దృఢమైన డెంటైన్ అనే పదార్థం తయారవుతాయి.

ఆహారాన్ని నమిలేందుకు, త్వరగా జీర్ణం కావడానికి దంతాలు ఎంతగానో ఉపయోపడతాయి.

అయితే ఒక్కోసారి మనం చేసే కొన్ని తప్పుల కారణంగా దంతాలు డ్యామేజ్ అవుతుంటాయి. పిప్పి పళ్లు మొదలు చిగుళ్ల నుంచి రక్తం కారడం దాకా ఎన్నో సమస్యలు వస్తాయి.

 కేవలం బ్రష్ చేయడంతోనే దంతాలు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. ఫ్లాసింగ్, మౌత్ వాష్ కూడా దంతాల ఆరోగ్యానికి ముఖ్యం.

మౌత్ వాష్ కోసం మార్కెట్లో అనేక ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిని కాకుండా ఇంట్లోనే మీరు సహజ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటిది అలోవేరా. దీని జ్యూస్ వాడకం చిగుళ్లలో రక్త స్రావం సమస్య దూరం చేస్తుంది.  ఇది చిగుళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

కొబ్బరినూనె కూడా దంతాలను ఆరోగ్యం ఉంచుతుంది. దంతాల ఫలకం, సమస్యలను దూరం చేయడానికి కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది.

కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఉంటాయి.  

కొబ్బరినూనెని నోటిలో వేసుకుని ఓ10 నుంచి 15 నిమిషాల పాటు పుక్కిలిస్తూ ఉండండి. దీని వల్ల నోటిలోని సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి.

ఉప్పు కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగడుపతుంది. ఉప్పులో ఉండే ఫ్లోరైడ్  దంతాలు బలహీనపడకుండా, విరిగిపోకుండా నిరోధింస్తుంది.

ఉప్పునీటితో కడుక్కోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియాకు కారణమయ్యే ఫలకం పెరగదు. దీని కారణంగా నోటిలో సమస్యల దూరమవుతాయి.

నోటిలోని బ్యాక్టీరియాను దూరం చేయడంలో బేకింగ్ సోడా బెస్ట్. బేకింగ్ సోడాతో పళ్ళని  తోమితే పసుపు రంగు దూరమవుతుని పరిశోధకులు పేర్కొన్నారు.

లవంగం, దాల్చిన చెక్కలు  పంటి నొప్పిని దూరం చేయడంతో పాటు నోటి దుర్వాసన దూరం చేస్తుంది.

 అయితే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.