పటిక బెల్లం అందరికి తెలిసిందే.. చూడడానికి అచ్చం చక్కెర లాగే ఉంటుంది.
పటిక బెల్లాన్ని కలకండ, మిశ్రి, కండ చక్కెర వంటి వివిధ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.
పటిక బెల్లం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పటిక బెల్లాన్ని పొడిలా చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
పటిక బెల్లాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
మోకాళ్ల నొప్పులను తగ్గించడంలోనూ పటిక బెల్లం ఉపయోగపడుతుంది.
పటిక బెల్లం పొడిని పాలలో వేసుకుని తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
బెల్లాన్ని వాడడం వల్ల బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
వేడి వేడి పాలలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.
కామెర్లను తగ్గించడంలో కూడా పటిక బెల్లం ఎంతో దోహదపడుతుంది.
పుదీనా రసంతో పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి.
పటిక బెల్లాన్ని నూరి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది.
పటిక బెల్లం వల్ల చాలా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.