ఈ రోజుల్లో చాల మంది సహజ సిద్డంగా లభించే వాటినే వాడడానికి ఎక్కువగా ఆసక్తిని చుపిస్తునారు.

ఇక ఆయుర్వేదం నుంచి వచ్చే మూలికలను అయితే మాత్రం అస్సలు వదిలి పెట్టరు.

ముఖ్యంగా ఈ  రోజుల్లో అతి మధురం గురుంచి  ఎవరికీ తెలియదు.అసలు అతి మధురంతో ఎలాంటి లాభాలు దాగి ఉన్నాయి?

దానిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అతి మధురం చక్కని పొడిగా చేసుకోవాలి. పొడిగా చేసుకున్న ఆ చూర్ణాన్ని మనం వాడే వాటిల్లో కలుపుకుని తాగాలి. 

మనకు మూత్రంలో మంటలా అనిపించినప్పుడు ఆ అతి మధురం పొడిని వేడి నీటిలో కలపాలి. అనంతరం యాలకుల పొడితో పాటు కొంత తేనే కూడా కలిపి తాగాలి.

మనకు మూత్రంలో మంటలా అనిపించినప్పుడు ఆ అతి మధురం పొడిని వేడి నీటిలో కలపాలి. 

అనంతరం యాలకుల పొడితో పాటు కొంత తేనే కూడా కలిపి తాగాలి.

చర్మంపై దద్దుర్లు, దురదలు వచ్చినప్పుడు అతి మధురం పొడిని పేస్ట్ లా చేసి రాసుకోవాలి. అలా వాడితే ఆ చర్మ సమస్య నుంచి కొంత బయటపడొచ్చు.

దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు అతి మధురం పొడి, దాల్చిన చెక్క పొడిని ఒక వేడి నీటిలో వేసి మరిగించాలి.

అలా మరిగించిన ఆ నీటిని తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు నయమవుతోంది. 

ఇక వేడి నీటిలో అతి మధురం పొడి వేసి కొద్దిసేపు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని కొంచెం కొంచెం తాగడం వల్ల గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు.

మన శరీరంపై ఎక్కడ ఎలాంటి పుండ్లు అయిన అతి మధురం పొడిని పేస్టులా చేసి ఆ పుండ్లపై రుద్దాలి. అలా వాడడం ద్వారా ఆ పుండ్లు త్వరగా నయమవుతాయి.

ముఖంపై మచ్చలు, మొటిమలు ఉన్నవారు రోస్ వాటర్, అతి మధురం చూర్ణం, తేనే కలిపి ముఖంపై రుద్దాలి. 

గంటసేపు తర్వాత కడుక్కుంటే మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. అలా తరుచు చేయడం వల్ల ఇలా మచ్చలు, మొటిమల సమస్యల నుంచి పూర్తిగా బయటపడొచ్చు.  

జుట్టు సమస్యతో బాధపడేవారు సైతం అతి మధురం పోడిని పేస్టులా చేసి జుట్టుకు రాసి గంట సేపు తర్వాత స్నానం చేయాలి.

ఇలా పైన తెలిపిన వాటికి అతి మధురం పొడిని వాడడం ద్వారా కొంతైన ప్రయోజనాలు పొందొచ్చుని ఆయూర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యులు సంప్రదించవలసిందిగా మనవి.