వైద్యులు చెవి నొప్పికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలొవేరా జెల్ ను తీసుకుని దురద లేదా నొప్పిగా ఉండే చెవిలో రెండు మూడు డ్రాప్స్ ను వేయాలి.
కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత దాన్ని బయటకు తీసేయొచ్చు.
కొద్దిగా అల్లం రసాన్ని తీసుకుని వేడి చేసి వడకట్టి నూనెలో కలపండి. ఇది చల్లారిన తర్వాత చెవి చుట్టూ అప్లై చేయండి.
ముందుగా ఒక టీస్పూన్ నూనెను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయండి. ఆ తర్వాత ఒక డ్రాపర్ తీసుకొని తలను పక్కకు వంచి చెవిలో కొన్ని చుక్కలు వేయండి.
రెండు నిమిషాల తర్వాత మీ తలను నిటారుగా ఉంచండి. దీని వల్ల చెవి దురద నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
చెవి నొప్పిని తగ్గించేందుకు చూర్ణం చేసిన వెల్లుల్లిని తీసుకుని నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో కొన్ని నిమిషాల పాటు నాన బెట్టండి.
ఆ తర్వాత దాన్ని వడకట్టి చెవిలో కొన్ని చుక్కల నూనెను వేయండి. ఇది చెవి దురదను తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ చుక్కలను చెవికి రాసుకుంటే చెవి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. కానీ దీనిని పిల్లలకు మాత్రం ఉపయోగించకూడదు.