పిత్తాశయంలో రాళ్లు లేదా గాల్ బ్లేడర్ స్టోన్స్ సమస్య అనేది చాలా మందిలో ఉండేదే.

అయితే ఈ రాళ్లు చిన్నగా ఉంటే పర్లేదు గానీ మరీ పెద్దవైనప్పుడే కడుపు కుడి పై భాగాన తీవ్రమైన నొప్పి వస్తుంది.

అలాంటి సందర్భాల్లో కొంతమందికి అత్యవసర శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది.

పైత్యరసంలో కొలెస్ట్రాల్, బిలిరుబిన్ మోతాదులు అధికంగా ఉండడం, గాల్ బ్లేడర్ పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు అనేవి ఏర్పడతాయి.

ఈ రాళ్ల సమస్యను పరిష్కరించడానికి మందులు, చికిత్స ఉన్నాయి. అయితే ఇంట్లో దొరికే సహజ వనరులతో కూడా నయం చేసుకోవచ్చు.   

పసుపులో ఉండే ఔషధగుణాలు బైల్ సాల్యూబిలిటీని మెరుగుపరిచి.. పిత్తాశయంలో రాళ్లను కరిగించేందుకు సహకరిస్తుంది.

పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారు రోజూ తేనెలో పసుపు కలుపుకుని సేవిస్తే నయమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి పిత్తాశయంలో రాళ్ల సమస్యను నిరోధించడంలో సహాయపడుతుంది.

గాల్ స్టోన్స్ తో బాధపడేవారు రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఈ రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట తాగితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.  

క్రాన్ బెర్రీ జ్యూస్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ ఒక గ్లాసు తాగితే రాళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.  

కొబ్బరి నూనె పిత్తాశయంలో రాళ్ల సమస్యను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

కొబ్బరి నూనెలు ఉండే మంచి కొవ్వులు కాలేయాన్ని సులువుగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

3 చెంచాల కొబ్బరి నూనె, పావు గ్లాస్ యాపిల్ రసం, సగం నిమ్మరసం చెక్క, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బ కలిపి తీసుకుంటే పిత్తాశయంలో రాళ్లు కరుగుతాయి.

రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే పిత్తాశయంలో రాళ్లు కరుగుతాయి. 

అలానే రోజూ ఒక కప్పు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల పిత్తాశయంలో రాళ్ళ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోజూ 5 నుంచి 6 చెంచాల ముల్లంగి రసం తాగితే గాల్ స్టోన్స్ సమస్య తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

గమనిక: ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీని గురించి అవగాహన కోసం వైద్యులను గానీ నిపుణులను గానీ సంప్రదించవలసినదిగా మనవి.