ప్రస్తుత రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి గ్యాస్ ట్రబుల్.

పెద్దలతో పాటు యువకులూ గ్యాస్ ట్రబుల్​తో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కడుపు ఉబ్బరంగా మారడం, వికారంగా అనిపించడం, తిన్నిది జీర్ణం కాకపోవడం లాంటివన్నీ అజీర్ణం కిందికే వస్తాయి.  

తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కవుగా లేకపోవడం, పోషకాలు లేని ఆహార పదార్థాలు తీసుకోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం అజీర్తికి కారణాలు. 

సరైన శారీరక శ్రమ చేయకపోవడం కూడా గ్యాస్ ట్రబుల్​కు కారణంగా చెప్పొచ్చు. 

గ్యాస్ ట్రబుల్​ను తగ్గించడానికి మార్కెట్​లో పలు రకాలు మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవేవీ శాశ్వత పరిష్కారం కాదు.

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించడానికి మార్కెట్ లో పలు రకాలు మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవేవీ శాశ్వత పరిష్కారం కాదు.

 ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. 

ప్రతిరోజూ తప్పనిసరిగా అరగంట సేపు వ్యాయామం చేయాలి. 

ఉదయం వాము, జీలకర్ర, ధనియాలను పది గ్రాముల చొప్పున తీసుకుని నీళ్లలో మరిగించి.. కషాయంగా చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు నిమ్మరసం తాగేందుకు వెనుకాడతారు. 

అయితే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు పొందొచ్చని సూచిస్తున్నారు. 

కడుపులో గ్యాస్​ను తొలగించే శక్తి వెల్లుల్లికి ఉందని హెల్త్ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. 

భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు.