మన శరీరంలో కళ్లు... మన అందాన్ని మరింత పెంచుతాయి. వాటి ప్రత్యేకత వేరు.

ప్రస్తుతం కంప్యూటర్, ఫోన్ల ఉపయోగం ఎక్కువైపోవడంతో కంటిపై ఎఫెక్ట్ బాగా పడుతోంది. 

కళ్లపై లైటింగ్ ఎఫెక్ట్ పడటం వల్ల కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయి.

కళ్లు ఆకర్షణీయంగా తయారై, మీ అందం రెట్టింపు కావాలంటే ఈ టిప్స్ పాటించండి.

కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని నిద్రించడం వల్ల‌ కళ్లకు చాలా మంచిది.

కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకున్నప్పుడు వాటికి సరిపడే రంగు మస్కారా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి.

పచ్చి పాలలో దూదిని ఉంచి కళ్ల చుట్టూ మసాజ్ లా చేసుకోవాలి. 

ఇలా చేయడం వలన కళ్ల చుట్టూ ఉన్న జిడ్డు, మురికి, నల్లని మచ్చలు త‌గ్గుతాయి.

కళ్లకు కాటుక పెట్టుకున్నా సరే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. గ్రామాల్లో తయారు చేసే కాటుక పెట్టుకుంటే మరీ మంచిది.

ఎనిమిది గంటల నిద్ర, కంటికి విశ్రాంతి ఉంటే కళ్లు అలసటగా కనిపించవు. 

కనుబొమ్మలు అందంగా, క్రమపద్ధతిలో ఉండేలా చేయడం వల్ల కళ్లు మరింత ఆకర్షణీయంగా కనబడతాయి.