దీంతో మెంటల్ గా డిస్ట్రబ్ అయిపోయి, నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతుంటారు.
ఎవరు ఏం చెబితే ఆ చిట్కాలు పాటించేస్తుంటారు. ఆయిల్స్, క్రీములు రాసేస్తుంటారు.
అయితే ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులని సరిగా ఉపయోగిస్తే.. మీ జట్టుని ఒత్తుగా చేసుకోవచ్చు.
కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా గిలక్కొట్టాలి. కుదుళ్లకు దీన్ని బాగా పట్టించి 20-30 నిమిషాలు ఆరనివ్వాలి.
తర్వాత గోరువెచ్చని నీరు, గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు.
మెంతులు కాసిన్ని 10 గంటలపాటు నానబెట్టాలి. వాటిని మెత్తగా పేస్టులా చేసుకుని జట్టుకు పట్టించాలి.
ఓ 30-40 నిమిషాల పాటు దీన్ని ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో క్లీన్ చేస్తే సరిపోతుంది.
తలస్నానానికి దాదాపు అందరూ షాంపూలనే ఉపయోగిస్తున్నారు. దీని బదులు ఉసిరికాయ, శీకాయలని యూజ్ చేయాలి.
వీటి వల్ల జట్టు ఒత్తుగా మారడంతోపాటు వెంటుక్రలు బలంగా తయారవుతాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి.
ఉల్లిపాయల నుంచి రసం తీసుకుని కుదుళ్లకు బాగా మర్దన చేయాలి. దీనిలోని సల్ఫర్.. జట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
కలబంద గుజ్జుని జట్టు కుదళ్లకు చేరాలా మర్దన చేయాలి. ఆ తర్వాత 30-40 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి.
ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే.. జట్టు ఒత్తుగా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
కొబ్బరినూనెలో ఆముదం కలిపి కాస్త వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేయాలి.
తర్వాత గోరువెచ్చని నీటిలో టవల్ ని ముంచి తలకి చుట్టి ఓ గంటపాటు వదిలేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా పైన చెప్పిన వాటిలో ఏది మీరు ఫాలో అయినాసరే జట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.