మనలో చాలా మందికి వచ్చే అనారోగ్య సమస్యల్లో వికారం ఒకటి. దీనికి చాలా కారణాలు ఉంటాయి.
తిన్న ఫుడ్ జీర్ణం కాకపోవడం, డీహైడ్రేషన్, నీరసం, జర్నీ చేయడం.. ఇలా వికారం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
వికారం వల్ల తల తిప్పినట్లు ఉంటుంది. వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.
అయితే వికారం నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవసరం లేదు. సింపుల్ టిప్స్ తో తగ్గించేసుకోవచ్చు.
నిమ్మకాయని సగానికి కోసి దాన్ని కొద్దిగా నలిపి వాసన చూస్తుండాలి. దీంతో వికారం తగ్గుతుంది.
ప్రతి 5,10 నిమిషాలకు నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని నోట్లో వేసుకుని మింగాలి. ఇలా చేసినా వికారం తగ్గుతుంది.
చాలా సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. గట్టిగా ఊపిరి పీల్చి నెమ్మదిగా వదులుతుండాలి. ఇలా చేయడం వల్ల వికారం కొద్దికొద్దిగా తగ్గుతుంది.
పుదీనా రసాన్ని టీ స్పూన్ తాగినా, పుదీనా ఆకులను వాసన చూసినా వికారం నుంచి బయట పడొచ్చు.
అలానే వికారం రాకుండా ఉండటం కోసం బాదంపప్పు, కోడిగుడ్లు, పాలను తీసుకుంటే బెటర్.
దాల్చిన చెక్క పొడిని చిటికెడు నమిలి మింగినా, అందులో కొద్దిగా తేనె కలుపుకుని మింగినా వికారం సమస్య తగ్గుతుంది.
కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల వికారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు దాహం తీరేవరకు ప్రతి 5,10 నిమిషాలకు కొద్ది కొద్దిగా నీటిని తాగుతుండాలి.
వికారం సమస్య ఉన్నవారు కారం తగ్గించాలి. ఒకవేళ ఇలా చేయకపోతే జీర్ణాశయంలో ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా వికారం వస్తుంది.
కొందరు తిన్న వెంటనే పడుకుంటారు. అలా చేయకూడదు. కనీసం 30 నిమిషాలైనా కూర్చోవాలి. దీంతో వికారం రాకుండా ఉంటుంది.
వికారం వస్తుంటే అలా బయటకు వెళ్లి కొద్దిగా చల్లగాలిలో, ప్రకృతిలో తిరగాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.