సైనస్ ల నుంచి శ్లేష్మం బయటకి పోయేలా చేయడం ద్వారా జలుబు వల్ల వచ్చే తలనొప్పిని నివారించవచ్చు.
ముక్కులో గాలి వెళ్లే మార్గాలను తేమగా ఉంచడం ఉత్తమ మార్గం.
అధిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వంటి కారణాలతో కూడా తలనొప్పి వస్తుంది.
వీటికి తోడు చలికాలంలో వాతావరణ మార్పు కారణంగా కూడా తలనొప్పి వస్తుంది.
చలికాలంలో తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ ఉష్ణోగ్రత, తరచుగా తలనొప్పికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.
అల్లాన్ని ఉపయోగించి మనకు తరచూ వచ్చే తలనొప్పిని నివారించ వచ్చు.
ఈ అల్లం తలనొప్పిని తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జలుబు కారణంగా తలనొప్పి వస్తుంటే.. వెచ్చని ద్రవ, ఘన పదార్ధాలను తీసుకోవటం మంచిదంట.
తలనొప్పి ఉన్నప్పుడు తరచుగా టీ లేదా కాఫీ తాగాలని సూచిస్తుంటారు.
కాఫీ లో ఉండే కెఫిన్ అనేది ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెదడును విశ్రాంతిగా ఉంచుతుంది.
అలానే దాల్చినచెక్క తలనొప్పిని తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది
అల్లం, దాల్చిన చెక్కతో పాటు లవంగాల్లో కూడా తలనొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి.
ఇలా అనేక పదార్ధాల ద్వారా చలికాలంలో వచ్చే తలనొప్పిని నివారించ వచ్చు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.