భాగ్య నగరంలో హోలీ పండుగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

మన దగ్గర కన్నా ఉత్తరాది వాసులు ఈ పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

హోలీ అంటేనే రంగుల పండుగ. కానీ మనం వాడే రంగుల్లో ఎన్నో రసాయనాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి.

ప్రస్తుత కాలంలో సహజసిద్ధమైన రంగులు కూడా లభిస్తున్నాయి. కానీ కాస్త ఖరీదు ఎక్కువ కావడంతో.. జనం వీటిపై పెద్దగా ఆసక్తి చూపరు.

అయితే మనం వాడే రంగుల్లో పాదరసం, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి అనేక రకాల విషపూరిత రసాయనాలు ఉంటాయి.

ఈ రంగులను వాడటం వల్ల చర్మం, కళ్లకు హనీ కలగడమే కాక.. శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

హోలీ సందర్భంగా రంగులను గాల్లోకి వెదజల్లుతారు. దీని వల్ల వాటిల్లో ఉండే కెమికల్స్‌ మన నోటిలోకి, శ్వాసనాళాల్లోకి ప్రవేశిస్తే.. శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.

కనుక శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు హోలీ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు.

అలానే రంగులు కళ్లల్లో పడితే.. తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. కనుక కళ్లద్దాలు వాడటం మంచిది.

హోలీ ఆడే సమయంలో ఒంటిని పూర్తిగా కప్పి ఉండే బట్టలు ధరించాలి.

దీని వల్ల రంగులు చర్మం మీద పడే అవకాశం తక్కువ.. ఫలితంగా స్కిన్‌ ఎలర్జీలను అడ్డుకోవచ్చు.

అలానే హోలీ ఆడటానికి ముందు ముఖానికి, కాళ్లు, చేతులకు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మేలు.

దీని వల్ల రంగులు చర్మం లోపలి పొరలకు వెళ్లకుండా.. మాయిశ్చరైజర్‌ తేమ అడ్డుకుంటుంది.

మాయిశ్చరైజర్‌ అందుబాటులో లేకపోతే.. కొబ్బరి నూనే రాసుకున్నా మంచిదే.

అలానే వాటర్‌ కలర్స్‌ వాడితే.. ముఖం మీద కాకుండా ఒంటి మీద చల్లుకోమని పిల్లలకు సూచించండి.

పెంపుడు జంతువులు, వీధి కుక్కల మీద రంగులు చల్లవద్దని పిల్లలకు చెప్పండి. రంగుల ప్రభావం వల్ల వాటి కూడా చర్మ సమస్యలు రావొచ్చు.

ప్రస్తుత కాలంలో వాటర్‌ బెలూన్స్‌తో హోలీ ఆడటం ట్రెండ్‌ అయ్యింది. రంగు నీళ్లు నింపిన బెలూన్స్‌ని నేరుగా ముఖం మీద విసురుతారు.

అలా చేయడం వల్ల వాటిలోని రంగు నీళ్లు.. ముక్కు, కళ్లలోకి వెళ్లి ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

 ఈ హోలీ నాడు గంధం, హెన్నా, పసుపు వంటి సహజసిద్ధమైన రంగులతో పండగ జరుపుకుంటే.. ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు.