మాములుగా తినేటప్పుడు, తాగేటప్పుడు చాలామందికి ఎక్కిళ్లు రావడం సహజం.

కానీ, అదే పనిగా వెంట వెంటనే ఎక్కిళ్లు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ వ్యాధి వచ్చే లక్షణాలు ఉన్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కిళ్లకు ఆ వ్యాధికి సంబంధం ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

త్వర త్వరగా తినడం, తాగడం ద్వారా కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మెడ మీద అధిక ఒత్తిడి ఉండడం వల్ల కూడా ఎక్కువగా ఎక్కిళ్లు వచ్చే ఆస్కారం ఉంటుందట.

 ఎక్కిళ్లపై అమెరికన్ జర్నల్ ఆఫ్ హాస్పైస్, పాలీయటివ్ మెడిసిన్ అధ్యయనం చేసింది.

ఇందులో భాగంగానే క్యాన్సర్ తో బాధపడుతున్న వారిని పరీక్షించగా.. 40 శాతం మంది రోగులు ఎక్కిళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది.

గొంతు, ఛాతి, తల క్యాన్సర్ ఉన్న వారికి ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయని తెలుసుకుంది.

క్యాన్సర్ తో బాధపడేవారు ఏకంగా 48 గంటల పాటు ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతుంటారట.

ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా 48 గంటల పాటు తగ్గకుండా ఎక్కిళ్లు వస్తే మాత్రం గొంతు, ఛాతి, తల క్యాన్సర్ వచ్చే సూచనలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇది కేవలం మీకు అవగాహన కోసమే. పూర్తి సమాచారం కోసం దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించండి