సీనీ ఇండస్ట్రీలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. హీరోలుమాత్రమే కాదు..  డైరెక్టర్లని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరో చూద్దామా..

 ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం క్రియేటివిటీ, టాలెంట్ చూసి మొదటి చూపులోనే అతనికి ఎట్రాక్ట్ అయ్యారు. 1988లో వీరు వివాహం చేసుకున్నారు.

క్రియేటివీటీ డైరెక్టర్ కృష్ణవంశీ , రమ్యకృష్ణను ప్రేమించిన ఏడేళ్ళ అనంతరం వివాహం చేసుకున్నాడు. 2003లో వీరి వివాహం జరిగింది

ఓ వైవు రాజకీయాలు మరోవైపు బుల్లితెర షోతో  తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్న రోజా.. డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి 2002  పెళ్లి చేసుకుంది

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఖుష్బు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటుంది.  డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఒకప్పటి హీరోయిన్.. ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తున్న నటి శరణ్య, ప్రముఖ  నటులు, దర్శకులు పొన్వన్నన్ పెళ్లి చేసుకున్నారు.

నటి  దేవయాని, డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించింది. పెద్దలు అభ్యంతరం చెప్పినా.. ఇద్దరూ కలిసి 2001 లో పెళ్లి చేసుకున్నారు.  

రుక్మిణి, ప్రియమైన నీకు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రీత కూడా, దర్శకులు హరిని పెళ్లి చేసుకున్నారు. సింగం సిరీస్, సూర్య హీరోగా నటించిన ఆరు, విశాల్ హీరోగా నటించిన భరణి, పూజ, విక్రమ్ హీరోగా నటించిన సామి స్క్వేర్, అలాగే దీని మొదటి పార్ట్ సామితో పాటు ఇంకా ఎన్నో తమిళ్ సినిమాలకి దర్శకత్వం వహించారు.

 హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  మహాబలిపురం సినీ పెద్దలు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.