స్టార్ హీరోయిన్ గా దశాబ్దన్నర కాలంగా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది చెన్నై సోయగం త్రిష.
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.
నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా గానీ, తరగని అందంతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తుంది.
తాజాగా త్రిషకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? త్రిష రూ. 35 కోట్లు పెట్టి చెన్నైలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట.
ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియల్ డిజైన్ కూడా రడీ చేయిస్తుందని సమాచారం.
పొన్నియిన్ సెల్వన్ తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన ఈ అమ్మడు రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
అయితే గతంలో కూడా రూ. 5 కోట్లు పెట్టి హీరో అజిత్ ఇంటి సమీపంలో ఇల్లు కొన్న త్రిష.. ప్రస్తుతం హీరో విజయ్ ఇంటి సమీపంలో 35 కోట్లతో మరో ఇల్లు కొనుగోలు చేసింది.
ఇంత భారీ మెుత్తంలో పెట్టి త్రిష ఇల్లు కొనగోలు చేయడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం త్రిష.. హీరో విజయ్ తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.