పునీత్ రాజ్ కుమార్ ఓ మంచి వ్యక్తి.. ఆయన లేరనే వార్తను చదివినా, వింటున్నా నమ్మాలనిపించడం లేదు.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. తన నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. అని అన్నారు విశాల్.
పునీత్ లాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ ను నేను ఇండస్ట్రీలో చూడలేదు.. ఆయన ఇండస్ట్రీలో కలిసినా, బయట కలిసినా సరే ఒకేలా ఉంటారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని భావోద్వేగంతో చెప్పారు విశాల్.
పునీత్ రాజ్ కుమార్ 1800 పిల్లల చదువుకు భరోసానిస్తున్నారు.. ఆ అనాథ పిల్లలకు అండగా నిలబడుతున్నారు.. వృద్ధాశ్రమాలకు సాయం చేశారు.. ఆయన చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను ఇతరులకు దానం చేసి ఇద్దరికి చూపునిచ్చారని విశాల్ గుర్తు చేశారు.