టాలీవుడ్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకమనే చెప్పాలి.

ఒక సినిమాకు, ఇంకో సినిమాకు సంబంధం లేకుండా వినూత్న కథలను ఎంచుకుంటూ కెరీర్​ను చక్కగా డిజైన్ చేసుకుంటున్నారు చెర్రీ.

అందుకే ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి హిట్లను ఆయన అందుకున్నారు.  

రామ్ చరణ్​ నటించిన సినిమాల్లో ‘ఆరెంజ్​’ మూవీ సమ్​థింగ్ స్పెషల్ అని చాలా మంది అంటుంటారు.

వసూళ్ల పరంగా డిజాస్టర్​గా నిలిచిన ‘ఆరెంజ్’ మూవీ.. ప్రేక్షకుల హృదయాలను గెల్చుకోవడంలో మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యింది. 

యూట్యూబ్, టెలివిజన్​లో ‘ఆరెంజ్​’ను చూసి ఎంతోమంది ఆ సినిమాకు అభిమానులుగా మారారు. 

డిఫెరెంట్ కాన్సెప్ట్​తో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ‘ఆరెంజ్’ సినిమాకు హ్యారిస్ జైరాజ్ అందించిన బాణీలు ప్రాణం పోశాయి. 

‘ఛలో రమ్మంటే వచ్చేసిందా’, ‘రూబా రూబా’ పాటలు ఇప్పటికీ చార్ట్​ బస్టర్స్​లో చోటు దక్కించుకుంటున్నాయి.

 ‘ఆరెంజ్’ ఫలితంతో చిత్ర నిర్మాత నాగబాబు కోలుకోలేకపోయారు. ఈ సినిమాతో ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. 

ఈ మూవీ కొట్టిన దెబ్బ నుంచి కోలుకునేందుకు తనకు చాలా ఏళ్లు పట్టిందని స్వయంగా నాగబాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

‘ఆరెంజ్​’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయనున్నారు. చరణ్​ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న రీ రిలీజ్ కానుందీ చిత్రం. 

రీ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్ల మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్మాత నాగబాబు ఫిక్స్ అయ్యారని సమాచారం.  

మళ్లీ విడుదల అవుతున్న యూత్ ఫుల్, మ్యూజికల్, లవ్ ఎంటర్ టైనర్ ‘ఆరెంజ్ ’ను చూసేందుకు మీరు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.