లవ్‌టుడే దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.
ఆయన కావాలని చేయకపోయినా.. కొందరు నెటిజన్లు మాత్రం కావాలనే ఆయన్ని వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది.
తాజాగా, ప్రదీప్ ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదలై’ సినిమా చూశారు.
ఆయన సినిమా బాగుందంటూ ఓ ట్వీట్ పెట్టారు.
ఆ ట్వీటులో.. ‘‘ విడుదలై సినిమా అద్భుతంగా ఉంది. దర్శకుడు వెట్రిమారన్‌కు, ఇతర టీంకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.
ప్రదీప్.. వెట్రిమారన్‌ను సార్ అని సంభోదించకపోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
‘‘ నీకంటే పెద్ద డైరెక్టర్‌కు మర్యాద ఇవ్వటం నేర్చుకో ’’ అంటూ మండిపడుతున్నారు.
వెట్రిమారన్‌ను సార్ అని అనాలంటూ సూచిస్తున్నారు.
విక్రమ్ సినిమాలోని రోలెక్స్ డైలాగ్‌కు సంబంధించిన వీడియోలు, మీమ్స్‌ను ఇందుకు ఉదాహరణగా పెడుతున్నారు.