ఇటీవలే నేచురల్ స్టార్ నాని  'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దసరా మూవీలో నాని, కీర్తి సురేష్ లు అద్భుతంగా నటించారు.

తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

మంచి హిట్ టాక్ తో దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది.

ఇక ఈసినిమాతో నాని ఓవర్సీస్ లో మంచి రికార్డు సాధించాడు.  

దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ యన్టీఆర్ రికార్డును నాని బ్రేక్ చేశాడు  

గత 5ఏళ్లుగా నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా  ఆడలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఓవర్సీస్ మార్కెట్ విషయంలో మాత్రం నాని స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు.

నాని ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను అందుకున్నాయి.

 తాజాగా ఆయన నటించిన దసరా కూడా ఈరోజు కలెక్షన్లతో  మిలినయ్ మార్క్ ను అందుకుంది.

 నాని ఇప్పటికే 7 సార్లు ఈ రేర్ ఫీట్ ను సాధించగా దసరా మూవీతో 8వసారి కూడా అందుకున్నాడు.

టాలీవుడ్ నుంచి ఎక్కువ 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన సెకండ్ హీరోగా నాని నిలిచాడు.

తొలి స్థానంలో మహేష్ బాబు 11 సినిమాలతో  ఉండగా.. మొన్నటి వరకు యన్టీఆర్ 7 సినిమాలతో రెండో స్థానంలో ఉండేవారు.

తాజాగా దసరా మూవీతో యన్టీఆర్ ను పక్కకు నెట్టి నెంబర్ 2 ప్లేస్ ను నాని దక్కించుకున్నాడు.

యన్టీఆర్, కొరటాల కాంబినేషనల్ రానున్న సినిమా ఖచ్చితంగా ఓవర్సీస్ లో మిలియన్ కొట్టే అవకాశం ఉంది

ఆలోపు నాని ఇంకో రెండు సినిమాలు వస్తే.. అవి కూడా మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది.