టూ వీలర్ అమ్మకాలపై కంపెనీలు ఆఫర్లు పెడుతుండడం సహజం.

‘ఐదు వేలో.. పది వేలో.. తగ్గింపు ధరలో ఇస్తాం..త్వరపడండి’ అన్నట్లుగా ప్రకటనలిస్తుంటాయి.

అందులోనూ దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగ సమయాల్లో ఇలాంటి ప్రకటనలు ఎక్కువుగా కనిపిస్తుంటాయి.

అయితే.. వీటన్నిటికీ భిన్నంగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫ్రీగా టూ వీలర్ సొంతం చేసుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది.

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎలా ఫేమస్సో.. కేరళలో ఓనం పండుగ అలానే ఫేమస్

ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మాలయాళం క్యాలెండర్ ను బట్టి ఈ పండుగ జరుపుకుంటారు

ఈ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసేలా దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ హీరో ఎలక్ట్రిక్ బంపరాఫర్ ప్రకటించింది. 

తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న.. ప్రతి 100వ కస్టమర్కు ఉచిత ఇ-స్కూటర్ను అందిస్తుంది. 

ఈ మేరకు ప్రకటనలు షురూ చేసింది. అంతేకాదు.. ఈ ఇ-స్కూటర్పై ఐదేళ్ల వారంటీని కూడా అందిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా 1000 టచ్పాయింట్లను సాధించడానికి హీరో కంపెనీ కేరళలోని మల్లాపురంలో అతిపెద్ద డీలర్షిప్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దేశంలో బిలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కలలను సాకారం చేయడానికి కట్టుబడి ‘నో ఎమిషన్’ మిషన్కు మద్దతుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని వేగవంతం చేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం.

అందులో భాగంగానే ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టామని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ సింగ్ గిల్ తెలిపారు. 

మరింకెందుకు ఆలస్యం.. ఫ్రీగా ఇ-స్కూటర్ సొంతం చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి.