చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలతో పాటు వ్యాపారంలోకి ప్రవేశిస్తుంటారు.

ఒకవైపు  సినిమాల్లో చేస్తూనే మరొకవైపు ఇతర బిజినెస్ లు చేస్తుంటారు.

ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్లు వివిధ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

తాజాగా ఓ స్టార్ హీరో కూడా కొత్త బిజినెస్ ను ప్రారంభించాడు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఎన్నో సినిమాలో తన నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

ఫోటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్ వంటి వాటిపై కూడా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే.

గతంలో బైక్ పై దేశంలో ప్రధాన నగరాలకు విహారయాత్ర చేశారు.

అలానే ఇటీవలే భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ పై టూర్ కి ముగించుకుని తిరిగి వచ్చారు.

తాజాగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

 అందులో ఓ వ్యాపార సంస్థను ప్రారంభిస్తున్న విషయం కూడా తెలిపారు.

ఆయన బైక్ రైడింగ్ తో చేసే విహార యాత్రను ఒక వృతిగా మార్చే ప్రయత్నం  చేశారు.

‘ఏకే మోటో రైడ్’ పేరుతో మోటార్ సైకిల్ విహారం యాత్ర సంస్థను ప్రారంభించినట్లు అజిత్ తెలిపారు.

దేశంతో పాటు ప్రపంచంలోని ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే వారికి ఏకే మోటో రైడ్ సంస్థ సహకరిస్తుందన్నారు.