వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు పిల్లలకు హాలిడేస్ ఇచ్చేశారు.

మరో మూడు వారాలైతే మిగిలిన తరగతుల పిల్లలకు కూడా సమ్మర్ సెలవులు ఇచ్చేస్తారు.

సెలవులతో ఇళ్లన్నీ పిల్లలతో సందడిగా మారిపోతాయి. 

పిల్లలు చేసే అల్లరి కొంతమేర బాగానే ఉంటుంది. ఇంట్లోని వారు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. 

కానీ ఒక్కోసారి పిల్లల అల్లరితో పెద్దలకు చిర్రెత్తుకొస్తుంది. పిల్లలు కాబట్టి అల్లరి చేయడం సహజమే. అలాంటి సమయంలో వారిని మందలించడం సరికాదు. 

అల్లరి చేసినప్పుడు పిల్లల్ని మందలించడం కంటే ప్రేమగా దగ్గరకు తీసుకుని విడమరచి చెప్పడం బెటర్. 

ప్రేమగా చెప్పే విషయాలు పిల్లల మెదడులో బలంగా నాటుకుపోతాయని మానసిక నిపుణులు అంటున్నారు. 

అలా కాకుండా మందలించడం ద్వారా అదుపులో పెడతామనుకుంటే మాత్రం పిల్లల్లో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి. 

ఎపిడెమియాలజీ అండ్ సైక్రియాట్రిక్ సైన్సెస్ జర్నల్​లో పబ్లిష్ అయిన  ఒక అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. 

 ఆ అధ్యయనం ప్రకారం.. పేరెంట్స్ ప్రతిదానికీ పిల్లలపై అరవడం లేదా కఠినంగా వ్యవహరించడం చేస్తే అది వారి మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందట. 

అంతేకాకుండా పిల్లల ఎదుట పేరెంట్స్ పోట్లాడుకోవడం లాంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

చాలా విషయాల్లో పేరెంట్స్​ను రోల్​ మోడల్​గా భావిస్తారు పిల్లలు. అందువల్ల వారి ఎదుట పేరెంట్స్ జాగ్రత్తగా మసలుకోవాలి. 

వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో ఆడుకోవడం, వ్యాయామం చేయడం, వారితో సంభాషించడం లాంటివి  చేస్తుండాలి. 

సమయం దొరికినప్పుడు పిల్లలను ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేదా ఏదైనా కొత్త ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్​కు తీసుకెళ్లడం వల్ల వారిలో కొత్త విషయాలపై అవగాహన కలుగుతుంది.