ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ పై టీమిండియా రికార్డ్ అంత అద్భుతంగా ఏమి లేదు. గత 18 ఏళ్ళ నుండి ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ పై ఇండియాకి ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేదు.
రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లతో టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
ఇక బౌలింగ్ లో కూడా టీమ్ ఇండియా స్థిరంగానే ఉంది. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ కివీస్ లో ఒక్క కేన్ విలియమ్సన్ కి మినహా మిగతా వారికి కొత్త కావడం కలసి వచ్చే అంశం.
న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం కూడా అంత దుర్బేధ్యంగా కనిపించడం లేదు. సీనియర్స్ అయిన గుఫ్తిల్, కేన్ విలియమ్సన్ అంతగా ఫామ్ లో లేరు. మిగిలిన బ్యాట్స్మెన్స్ కి అంతగా అనుభవం లేదు. వారి టీమ్ లో రాస్ టేలర్ లేకపోవడం మనకి కలసి వచ్చే అంశం.
న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఒక్క బౌల్ట్ బౌలింగ్ లో జాగ్రత్త వహిస్తే.. మిగిలిన బౌలర్లు ఎవ్వరూ కూడా టీమిండియాని ఇబ్బంది పెట్టలేరు.
న్యూజిలాండ్ మరో సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ అస్సలు ఫామ్ లో లేకపోవడం, న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ, రాహుల్ కి మంచి రికార్డ్ ఉండటం కూడా టీమిండియాకి ఉరటని ఇచ్చే విషయం
యూఏఈ పిచ్ ల పై న్యూజిలాండ్ కన్నా.., ఇండియన్ ప్లేయర్స్ కి మంచి అనుభవం ఉంది. ఈ ఎక్స్ పీరియన్స్ కూడా మనకి పనికి వస్తుంది.
న్యూజిలాండ్ తో తలపడ్డ ప్రతిసారి టీమిండియాలో మెరిసే ఆటగాడి ఎవరంటే రవీంద్ర జడేజా. గత వరల్డ్ కప్ సెమీస్ లో కూడా మనం జడేజా నుండి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ చూసి ఉన్నాము. కాబట్టి.. ఈ విషయంలో కూడా ఇండియన్ టీమ్ కి డోకా లేదు.
గతంతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టు.. ఇప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తోంది. అనుభవం లేని ఆ జట్టు ఆటగాళ్లు బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్ ని ఎలా ఎదుర్కొంటారు అన్నది కూడా ప్రశ్నే.
న్యూజిలాండ్ కొత్త ఆటగాడు కాన్వే నుండి మాత్రం టీమిండియాకి ప్రమాదం పొంచి ఉంది. కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ని త్వరగా పెవిలియన్ చేర్చకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఓవరాల్ గా బ్యాటింగ్, బౌలింగ్, వంటి అంశాలన్నింటిలో న్యూజిలాండ్ కన్నా టీమిండియానే మెరుగ్గా ఉండటం విశేషం.