ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన గుండెపోటు వార్తలే వినిపిస్తున్నాయి
వయస్సుతో సంబంధం లేకుండా యువకుల్లో కూడా ఈ గుండె పోటు వస్తుంది.
ఈ ఘటనలు చూస్తుంటే గుండె పోటు ఎవరికైనా వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
సాధారణంగా 30 శాతం గుండెపోటులు ఈసీజీ పరీక్షల ద్వారానే నిర్ధారించబడ్డాయి.
ఛాతిలో నొప్పి వచ్చే సమయంలో ఎడమ చేయి లేదా కుడి చేయి లాగడం వంటివి గమనించవచ్చు
అలానే మొండెం, చాతి దవడ నొప్పితో కుడి వైపు ఎక్కువగా రావడం వంటి అంశాలను గమనించవచ్చు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎవరైనా గుండెపోటుకి గురైతే, ప్రతి నిమిషం వారికి అమూల్యమైనది.
వైద్యసిబ్బంది కోసం వేచి ఉన్న సమయంలో, ఆసుపత్రికి వెళుతున్న మార్గంలో ఒక ఆస్ప్రిన్‌ను తీసుకోండి.
గుండె పోటు సమయంలో ఆస్పిరిన్ (300 mg), క్లోపిడోగ్రిల్ (300 mg), అటోర్వాస్టాటిన్( 80 mg) మందులు తీసుకోవాలి.
గుండెపోటు లక్షణాలు కనిపించిన 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం మంచిది.
అత్యవసర సమయంలో మాత్రమే వీటిని వేసుకుంటారు. ఈ టాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు.
ఆస్పిరిన్ టాబ్లెట్ వల్ల ప్లేట్‌లెట్ అభివృద్ధి నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది.
అయితే ఈ టాబ్లెట్ వేసుకున్నామని వైద్య సాయం పొందకుండా ఉంటే ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ టాబ్లెట్ అనేది కేవలం ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ఇబ్బంది లేకుండా ఉండేందుకనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోడం ఉత్తమం.