వేపతో ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలేమిటో తెలుసుకుందా!

 వేప వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.  వేప చెట్టు ఉన్న ఇంట్లో ఒక వైద్యుడు ఉన్నట్టేనని పెద్దలు చెబుతుంటారు.

ఆయరేద్వ చికిత్సా విధానంలో వేపను ఔషధంగా ఉపయోగిస్తారు. 

హైదరాబాద్ కు  చెందిన పరిశోధకులు వేప గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. వేప కేన్సర్ తో పోరాడుతున్నట్టు గుర్తించారు.

వేపలో ఉండే 'నింబోలైడ్' అనే ఫైటో కెమికల్  క్యాన్సర్ను నయం చేసే గుణం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. 

మన రోజు వారి అలవాట్లలో భాగంగా వేపను ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల శరీరంలోని విషతుల్య పదార్థాలు తొలగిపోతాయి. 

కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపడేందుకు, జీర్ణ క్రియ సవ్యంగా జరిగేందుకు వేప ఉపకరిస్తుంది.

వేపను తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. 

అల్సర్లు, మలబద్దకం, ఇన్ఫెక్షన్లు తగ్గించి ఆహారనాళ సంబంధ సమస్యలు రాకుండా       చేయడంలో వేప ఉపకరిస్తుంది. 

ఇన్ఫెక్షన్ల కారణంగా కడుపులోని రోగనిరోధక శక్తి  తగ్గిపోకుండా కాపాడుతుంది.

వేప వల్ల లభించే ప్రయోజనాల్లో ముఖ్యమైంది డయాబెటిస్ను నియంత్రణలో ఉంచడం.        ఇందులోని రసాయనాలు శరీరానికి తగినంత ఇన్సులిన్ అందేలా చూస్తాయి.

షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ మీద ఆధారపడే అవకాశాన్ని వేప  తగ్గిస్తుంది.

 వేప ఉత్పత్తులను టూత్ పేస్టులు, మౌత్ వాష్లలో ఉపయోగిస్తున్నారు. 

చిగుళ్లలో దాగి ఉన్న బ్యాక్టీరియాను ఇది చంపేసి, నోరు దుర్వాసన రాకుండా వేప అడ్డుకుంటుంది.

వేప నూనెను ఉపయోగించి అవాంఛనీయ గర్భ రాకుండా అడ్డుకోవచ్చు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల ముప్పు కూడా తగ్గించుకోవచ్చు.

వేపాకులను ముద్దగా చేసి గాయమైన చోట రాస్తే.. గాయాలు త్వరగా మానుతాయి.

వేప పువ్వుల జ్యూస్ను నిమ్మ లేదా తేనెతో కలిపి కూడా తాగితే  త్వరగా బరువు తగ్గొచ్చు.

 డ్యాండ్రఫ్ సమస్య తగ్గడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వేపాకు ఉపకరిస్తుంది. 

పింపుల్స్, బ్లాక్ హెడ్స్ను తొలగించడంలో వేప తోడ్పడుతుంది. వేపాకులోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మ వ్యాధులను నయం చేస్తాయి.