సాధారణంగా పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే

పాల వలన ఎముకలు, దంతాలు బలంగా మారడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

పాలను సరైన పద్దతిలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి

పాలను సరైన పద్దతిలో తీసుకోకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణుల హెచ్చరిక  

కొందరు పచ్చిపాలను కూడా సేవిస్తుంటారు.. మరి పచ్చిపాలు ఆరోగ్యానికి మంచిదేనా?

పచ్చిపాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ.. నేరుగా తాగినప్పుడు గుండె సంబంధిత రోగాలు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

 ఒకప్పుడు పచ్చిపాలు తాగడం మంచిదే అని చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల సలహా

పచ్చిపాలలో ఎకోలి, కాంపైలోబాక్టర్, లిస్టెరియా, యార్సినియా, సాల్మొనెల్లా వంటి ఎన్నో హాని చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి

అవి జీర్ణ సమస్యలతో పాటుగా అనారోగ్యానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు పచ్చిపాలు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉందట

పాలిచ్చే ఆవుకు లేదా గేదెకు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి ఉంటే.. అది గర్భిణులపై, బాలింతలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట

పాలలో విటమిన్ బి, డి లతో పాటు కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి

మొత్తానికి కాచిన పాలను తీసుకుంటే మంచిదని, అవి మెదడు పనితీరుకు సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు